చిట్టి సైన్సు సంగతులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
చిట్టి సైన్సు సంగతులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, సెప్టెంబర్ 2012, సోమవారం

ప్రశ్న: పప్పులు ఉడికించేప్పుడు మొదట్లోనే ఉప్పు వేయరు. అలా వేస్తే పప్పు ఉడకదంటారు. పప్పు ఉడకడానికి, ఉప్పు వేయకపోవడానికి సంబంధం ఏమిటి?


ప్రశ్న: పప్పులు ఉడికించేప్పుడు మొదట్లోనే ఉప్పు వేయరు. అలా వేస్తే పప్పు ఉడకదంటారు. పప్పు ఉడకడానికి, ఉప్పు వేయకపోవడానికి సంబంధం ఏమిటి?

జవాబు: పప్పు సాధారణంగా పిండి పదార్థంతోను, మాంసకృత్తులు (ప్రోటీన్లు)తోను నిండి ఉంటుంది. పప్పులోని పిండిపదార్థం తొందరగానే ఉడికినా ఎక్కువ సేపు వండితేకానీ ఉడకనివి మాంసకృత్తులే. బాగా ఉడకడం అంటే పొడవైన ప్రోటీను అణువులు చిన్న చిన్న ముక్కలవడమే. ఇవి మన జీర్ణవ్యవస్థలో సులభంగా అరిగిపోతాయి. నీటి సమక్షంలో ప్రోటీను అణువులు ముక్కలవడాన్ని జలవిశ్లేషణం(hydrolysis)అంటారు. నీటిలో ఉప్పు వేయడం వల్ల ఈ ప్రక్రియ మందగిస్తుంది. అందుకే వేయరు. అంటే ఉప్పు దగ్గర మన పప్పులు ఉడకవన్నమాట.

- ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

ప్రశ్న: 'జంక్‌ ఫుడ్‌' అంటే ఏమిటి? ఇది ఏఏ పదార్థాలలో ఉంటుంది?


ప్రశ్న: 'జంక్‌ ఫుడ్‌' అంటే ఏమిటి? ఇది ఏఏ పదార్థాలలో ఉంటుంది?

జవాబు: ఇంగ్లిషులో జంక్‌ అంటే చెత్త లేదా పనికిరాని కుప్ప అని అర్థం. ఈమెయిల్‌లో కూడా జంక్‌ అనే పదాన్ని విని ఉంటారు. పనికిరాని, ప్రమాదకరమైన మెయిల్స్‌ను జంక్‌ మెయిల్స్‌ అంటారు. అలాగే పోషక విలువల పరంగా అంతగా ఉపయుక్తం కానిది, ఎంతో కొంత ఆరోగ్యానికి హాని కలిగించేది లేదా రుచీపచీ లేని నానా చెత్త ఆహార పదార్థాలకు ఇచ్చిన సర్వసాధారణ నామధేయం 'జంక్‌ఫుడ్‌'. బజార్లో రోడ్లమీద అమ్మే ఆహార పదార్థాలను జిహ్వ చాపల్యాన్ని సంతృప్తిపరచడానికి రకరకాల మసాలాలు వేసి వేయిస్తారు. పనిలో పనిగా వీధుల్లోని దుమ్ము, ధూళి, ఈగలు, చెమట అందులో కలిసి ఆ చెత్త ఆహారం మరింత చెత్తగా తయారవుతుంది. దానికి తోడు వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వాడడం వల్ల వేపుళ్లు మరింత నల్లగా ఉంటాయి. హోటళ్లలోను, బండల దగ్గర దొరికే ఐస్‌క్రీములు, గప్‌చిప్‌లు క్రిముల మయమవడం వల్ల అవి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. ఇలాటి జంక్‌ఫుడ్‌ జోలికి పోకుండా ఉండడం మేలు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;-రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

ప్రశ్న: తుపానులకు థానే, లైలా అంటూ పేర్లు ఎలా పెడతారు?


ప్రశ్న: తుపానులకు థానే, లైలా అంటూ పేర్లు ఎలా పెడతారు?

జవాబు: ఆధునిక సాంకేతిక అభివృద్ధి వల్ల తుపానుల రాక గురించి మనం కొన్ని రోజుల ముందే తెలుసుకోగలుగుతున్నాం. తుపాను హెచ్చరిక కేంద్రాలు, వాతావరణ కేంద్రాలు, ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా తుపాను ఉనికిని, అది ప్రయాణించే దిశను కూడా అంచనా వేసి ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయగలుగుతున్నాం. అంతర్జాతీయ స్థాయిలో పనిచేసే ప్రపంచ వాతావరణ సంస్థ (World Metereological Organisation) వివిధ దేశాల వాతావరణ పరిశోధన సంస్థలను వాటి సమీప సముద్రాల్లో ఏర్పడే తుపానులకు పేర్లు ఇవ్వమని అడుగుతుంది. అలా అకారాది క్రమంలో ఆయా దేశాల వారు ఇచ్చిన పేర్లనే ఆయా ప్రాంతాలను తాకనున్న తుపానులకు కేటాయిస్తారు. ఉదాహరణకు హిందూ మహా సముద్రంలో సంభవించే తుపానులకు భారత దేశం అగ్ని, ఆకాశ్‌, బిజిలి, లాల్‌, లహర్‌, మేఘ్‌, సాగర్‌, వాయు అనే పేర్లు ఇచ్చింది. ఇప్పటికే బిజిలి వరకు పేర్లు అయిపోయాయి. లైలా పేరును పాకిస్థాన్‌ పెట్టింది. థానే పేరును మయన్మార్‌ పెట్టింది. ఆయా దేశాల సామాన్యులు సులువుగా గుర్తు పెట్టుకునేందుకు, తుపానుల ప్రభావాన్ని చారిత్రకంగా నమోదు చేయడానికి తుపానులకు పేర్లు పెడతారు.


- ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌,-వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

ప్రశ్న: స్టెయిన్‌లెస్‌ స్టీలు తుప్పు పట్టకుండా ఎలా ఉంటుంది?


ప్రశ్న: స్టెయిన్‌లెస్‌ స్టీలు తుప్పు పట్టకుండా ఎలా ఉంటుంది?

జవాబు: ఇనుప వస్తువులకు వాతావరణంలోని తేమ, ఆక్సిజన్‌ తగిలినప్పుడు రసాయనిక చర్య జరిగి ఐరన్‌ ఆక్సైడు పొర ఏర్పడుతుంది. ఈ పొరనే 'తుప్పు' అంటారు. స్టెయిన్‌లెస్‌ స్టీలులో కూడా ఇనుము ఉన్నప్పటికీ, దాంతో పాటు కలిసి ఉండే ఇతర పదార్థాలపై పరిసరాల ప్రభావం ఉండదు. స్టీలులో ఇనుము, క్రోమియం మాంగనీస్‌, సిలికాన్‌, నికెల్‌, కార్బన్‌ మూలకాలు ఎక్కువ పాళ్లలో ఉంటాయి. ఈ మూలకాలకు తేమ, ఆక్సిజన్‌ తగిలితే లోహ ఆక్సైడ్లు, హైడ్రాక్సైడ్‌లతో కూడిన సన్నని స్థిరమైన పొర ఏర్పడుతుంది. పరిసరాల ప్రభావం స్టెయిన్‌లెస్‌ స్టీలులోని ఇనుముపై పడకుండా ఈ పొర అడ్డుకుంటుంది.ఈ పొర మందం అత్యంత సూక్ష్మంగా (10-8 సెంటీమీటర్లు) ఉండడంతో మన కంటికి కనబడదు.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్ 

ప్రశ్న: వాషింగ్‌ మెషిన్‌లో వేసిన దుస్తుల జేబుల్లో పొరపాటున ఉండిపోయే కరెన్సీ నోట్లు చిరగవని అంటారు. ఎందువల్ల?


ప్రశ్న: వాషింగ్‌ మెషిన్‌లో వేసిన దుస్తుల జేబుల్లో పొరపాటున ఉండిపోయే కరెన్సీ నోట్లు చిరగవని అంటారు. ఎందువల్ల?

జవాబు: అన్ని సందర్భాలలోను ఇది వర్తించకపోయినా ఇందుకు ఒక కారణం ఉంది. నోట్‌ పుస్తకాలు, న్యూస్‌పేపర్‌కు వాడే మామూలు కాగితాలకు, కరెన్సీ నోట్ల తయారీకి ఉపయోగించే కాగితానికి మధ్య చాలా తేడా ఉంటుంది. మామూలు కాగితాలను చెట్ల నుంచి వచ్చే సెల్యులోజ్‌ పదార్థంతో తయారు చేస్తారు. కరెన్సీ నోట్లకు వాడే కాగితాన్ని పత్తి, ఊలు మిశ్రమంతో కూడిన లినెన్‌, గుడ్డ పీలికల నార నుంచి తయారు చేస్తారు. ఇందులో పోగులు చాలా దగ్గరగా బంధించబడి, మామూలు కాగితంలోని పోగుల కన్నా దృఢంగా ఉంటాయి. ఇవి నీటి వల్ల అంత త్వరగా ప్రభావితం కావు. సెల్యులోజ్‌తో చేసిన మామూలు కాగితం నీటిలో పడితే వెంటనే నీటిని పీల్చుకుని పోగులు విడిపోతాయి. దాంతో అది చిరిగిపోయి ఉండలు చుట్టుకుపోతుంది. కరెన్సీ నోట్లను నాణ్యమైన కాగితంతో చేయడం వల్ల అది అంత తొందరగా చిరిగిపోవు. అంతేకాకుండా మనం చేతులతో ఉతికినంత తీవ్రంగా వాషింగ్‌ యంత్రం దుస్తులను ఉతకదు. అది కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో దుస్తులను తిప్పడం ద్వారా వాటిలోని ధూళి కణాలను వేరు చేస్తుంది. ఇందువల్ల కూడా దుస్తుల జేబుల్లో ఉండిపోయిన కాగితాలు చిరిగిపోయేంత తీవ్రమైన ప్రభావానికి గురికావు.


ప్రశ్న: కీ బోర్డుపై అక్షరాలు వరుస క్రమంలో ఉండవెందుకు?

జవాబు: మనం సాధారణంగా వాడే కీబోర్డును క్వర్టీ (Qwerty) కీబోర్డు అంటాము. కీ బోర్డు పై వరుసలో ఉన్న మొదటి ఆరు అక్షరాలు Q, W, E, R, T, Y కాబట్టి వాటిని కలిపేసి పలుకుతారు. ఈ తరహా కీబోర్డును 1868లో అమెరికాకు చెందిన క్రిస్టోఫర్‌ షోల్స్‌ రూపకల్పన చేశారు. అంతకు ముందు A, B, C, D లాగా వరుసగా ఉన్న కీబోర్డు పై ఆయన కొన్ని ఇబ్బందులు (practical difficulties) గమనించారు. ఇంగ్లిషు భాషలో కొన్ని అక్షరాలు అతి ఎక్కువసార్లు, కొన్నయితే అతి అరుదుగా వస్తుంటాయి. ఉదాహరణకుQ, Z W, X, Fవంటి అక్షరాల వాడకం తక్కువగా ఉంటుంది. అచ్చులయిన A,E,I,O,U లతో పాటు, P, B, L, M, N, K, L వంటివి ఎక్కువ సార్లు తారసపడతాయి. అక్షరాల మీద తీవ్రమైన ఒత్తిడి లేకుండాను, ఎక్కువసార్లు వచ్చే అక్షరాలు చేతివేళ్లకు అనుకూలమైన స్థానాల్లోను ఉండేలా షోల్స్‌ తాను రూపొందించిన టైపు మిషన్‌ కీబోర్డునుQwerty నమూనాలో చేశాడు. అదే ఒరవడి కంప్యూటర్‌ కీబోర్డులకూ విస్తరించింది. కానీ ఆధునిక పరిశోధనల ప్రకారం Qwerty కన్నా మరింత సులువైన కీ బోర్డు అమరికలున్నట్లు రుజువు చేశారు. ఉదాహరణకు Dvorak కీబోర్డు ఒకటిి. కానీ ఇది ప్రచారంలోకి రావడం లేదు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌,-వరంగల్‌, రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక.

ప్రశ్న: ఒకోసారి పోలీసులు బాష్పవాయువును ప్రయోగిస్తారు. ఇది ఎలా పని చేస్తుంది?


ప్రశ్న: ఒకోసారి పోలీసులు బాష్పవాయువును ప్రయోగిస్తారు. ఇది ఎలా పని చేస్తుంది?

జవాబు: గుంపులుగా చేరి అలజడి సృష్టించే ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు (tear gas) ను ప్రయోగిస్తారు. ఈ వాయువు కళ్లలో నీళ్లు తెప్పిస్తుంది కాబట్టే దీనికాపేరు. యుద్ధాల్లో కూడా ఉపయోగిస్తారు కాబట్టి దీన్ని యుద్ధవాయువు అని కూడా అంటారు.

బాష్పవాయువు హానికరమైనది. కొన్ని రసాయనాలను తుపాకుల వంటి ఆయుధాల్లో కూరి పేల్చడం ద్వారా దీన్ని ప్రయోగిస్తారు. ఈ రసాయనం ఘన, ద్రవ రూపాల్లో ఉంటుంది. ఆల్ఫా క్లోరా సిటెటోఫినోన(Alpha Choraceteto Phenone) అనే రసాయనం ఘన రూపంలోను, ఇథైల్‌ అయోడో ఎసిటేట్‌ (Ethyl Iodo Acetate) ద్రవరూపంలోను ఉంటాయి.

బాష్పవాయువు నుంచి వెలువడిన ఆవిర్లు కళ్లలోని బాష్పగ్రంథులపై రసాయనిక చర్య జరుపుతాయి. అందువల్ల కళ్లల్లో మంట పుట్టి కన్నీరు ఎక్కువగా వస్తుంది. కనుగుడ్లపై నీరు ఎక్కువగా చేరడంతో చూపు కూడా మందగిస్తుంది. కనురెప్పలు వాస్తాయి. కడుపులో వికారం పుట్టి వాంతులు కూడా అవుతాయి. చర్మంపై బొబ్బలు వస్తాయి. కానీ ఈ మార్పులన్నీ తాత్కాలికమే. కొద్ది సేపటికి తగ్గిపోతాయి.

బాష్పవాయువుకు గురైన వారిని బాగా గాలి వీచే విశాలమైన ప్రదేశానికి తీసుకువెళ్లాలి. వారి కళ్లను ఉప్పు నీటితో కానీ, బోరిక్‌ యాసిడ్‌ ద్రవంతో కానీ కడగాలి. సోడియం బై కార్బొనేట్‌ ద్రవాన్ని శరీరంపై బాష్పవాయువు సోకిన భాగాలకు పూయాలి. దీని ప్రభావం ఎక్కువగా పడకూడదనుకుంటే కోసిన ఉల్లిపాయల ముక్కలను చేతిలో పట్టుకుంటే చాలు. అవి బాష్పవాయువును పీల్చుకుని కళ్లపై అంత ప్రభావం చూపవు.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్

ఏసి యంత్రం నుంచి గాలి చల్లగా ఎలా వస్తుంది? ఆ గాలి ఆరోగ్యానికి మంచిదేనా?


ప్రశ్న: ఏసి యంత్రం నుంచి గాలి చల్లగా ఎలా వస్తుంది? ఆ గాలి ఆరోగ్యానికి మంచిదేనా?

జవాబు: వాయువుల్లో వాస్తవ వాయువులు (Real Gases) ఆదర్శ వాయువులు(Ideal Gases) అనే రెండు రకాలున్నాయి. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో వీటిని పరస్పరం మార్చుకోవచ్చును. ఇందులో వాస్తవ వాయు ధర్మాల్లో ఓ ప్రధాన ధర్మం జౌల్‌ థామ్సన్‌ గుణకం. ఓ వాయువును బాగా సంపిలినీకరణం (Compression) చేశాక ఒక్కసారిగా విరళీకరణా(expansion)నికి గురిచేస్తే ఆ వాయువు ఉష్ణోగ్రత పడిపోయే ధర్మానికి జౌల్‌ థామ్సన్‌ గుణకం ఓ కొలబద్ద. ఇది క్లోరో ఫ్లోరో కార్బన్‌ బృందానికి చెందిన ఫ్రియాన్‌ వాయువుకు చాలా ఎక్కువ. అందుకే ఏసీ యంత్రాల తయారీలో దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. ప్రత్యేక మోటారుతో మొదట ఫ్రియాన్‌ వాయువును అధిక పీడనానికి లోను చేస్తారు. అలా అధిక పీడనంలో ఉన్న ఫ్రియానును జల్లెడలాగా అంటే గొట్టాల చట్రంలోకి విస్తరించినపుడు ఆ గొట్టాలు చల్లబడతాయి. ఆ గొట్టాల మీదుగా గాలి పదేపదే చక్రీయంగా (Cyclically) వెళ్లేలా చేయడం వల్ల గదిలో గాలి క్రమేణా కూడా చల్లబడుతుంది. ఏసీ యంత్రాలు, రిఫ్రిజరేటర్లు పనిచేసేది ఈ యంత్రాంగం ఆధారంగానే. ఏసీ గాలి వల్ల ప్రమాదం ఏమీ లేదు. ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదు. ఎటొచ్చీ ఫ్రియాన్‌ వాయువుతోనే ఉంది తంటా అంతా. ఇది వాతావరణంలోకి ఏమాత్రం లీక్‌ అయినా ఓజోన్‌ పొరను దెబ్బతీస్తుంది. తద్వారా భూ వాతావరణానికి అనారోగ్యం కలుగుతుంది.


-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌, రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

9, సెప్టెంబర్ 2012, ఆదివారం

దోమలను గురించి తెలుసుకుందాం



అయస్కాంతం కధ


అయస్కాంతం కధ 
njáTkÍØ+Ôá+ ¿£<¸Š
dŸTeÖsÁT 2500 dŸ+eÔáàs\ ç¿ìÔá+ »eÖÂ>•dtµ nHû >=çÂs\ ¿±|Ÿ] sÃp Ôáq >=çÂs\qT yûT|ŸÚÔáÖ ¿=+&ƒ\ýË ÜsÁT>·TÔáÖ –+&ûy&ƒT. nÔá“ #ûÜ¿£çsÁ n&ƒT>·T uó²>±q ‚qT|Ÿ Ô=&ƒT>·T –+&û~. ÿ¿£sÃE nÔá“ >=çÂs\T yûTdŸÖï –+fñ nÔáqT ÿ¿£ ºq• Å£”+³ ÿ&ƒT¦q• –q• ssTTMT<РţLsÁTÌ“ Ôáq #ûÜ ¿£çsÁÔà n³Ö ‚³Ö ¿£~*dŸTïH•&ƒT. n|ŸÚÎ&ƒT >·T\¿£sÞø¢Å£” Ôáq ¿£çsÁ n&ƒT>·T uó²>±q >·\ ‚qT|Ÿ Ô=&ƒT>·T¿ì @<à n+³TÅ£”q•³T¢ n“|¾+º+~. ‹jáT³¿ì rd¾ #áÖXæ&ƒT. ÿ¿£ ssTT € ¿£çsÁ ‚qT|Ÿ Ô=&ƒT>·TÅ£” n+³TÅ£”“ –+~.
€ ssTT ÿ¿£ dŸVŸ²È njáTkÍØ+Ôá+.
n³Te+{ì sÞø¢qT ýË&Ž kþ¼HŽ n“ |¾*#sÁT.