24, సెప్టెంబర్ 2012, సోమవారం

ప్రశ్న: 'జంక్‌ ఫుడ్‌' అంటే ఏమిటి? ఇది ఏఏ పదార్థాలలో ఉంటుంది?


ప్రశ్న: 'జంక్‌ ఫుడ్‌' అంటే ఏమిటి? ఇది ఏఏ పదార్థాలలో ఉంటుంది?

జవాబు: ఇంగ్లిషులో జంక్‌ అంటే చెత్త లేదా పనికిరాని కుప్ప అని అర్థం. ఈమెయిల్‌లో కూడా జంక్‌ అనే పదాన్ని విని ఉంటారు. పనికిరాని, ప్రమాదకరమైన మెయిల్స్‌ను జంక్‌ మెయిల్స్‌ అంటారు. అలాగే పోషక విలువల పరంగా అంతగా ఉపయుక్తం కానిది, ఎంతో కొంత ఆరోగ్యానికి హాని కలిగించేది లేదా రుచీపచీ లేని నానా చెత్త ఆహార పదార్థాలకు ఇచ్చిన సర్వసాధారణ నామధేయం 'జంక్‌ఫుడ్‌'. బజార్లో రోడ్లమీద అమ్మే ఆహార పదార్థాలను జిహ్వ చాపల్యాన్ని సంతృప్తిపరచడానికి రకరకాల మసాలాలు వేసి వేయిస్తారు. పనిలో పనిగా వీధుల్లోని దుమ్ము, ధూళి, ఈగలు, చెమట అందులో కలిసి ఆ చెత్త ఆహారం మరింత చెత్తగా తయారవుతుంది. దానికి తోడు వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వాడడం వల్ల వేపుళ్లు మరింత నల్లగా ఉంటాయి. హోటళ్లలోను, బండల దగ్గర దొరికే ఐస్‌క్రీములు, గప్‌చిప్‌లు క్రిముల మయమవడం వల్ల అవి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. ఇలాటి జంక్‌ఫుడ్‌ జోలికి పోకుండా ఉండడం మేలు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;-రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి